Thursday, September 19, 2024
spot_img

AndraPradesh : పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన సర్పంచ్

AndraPradesh : పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ లో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆదేశాలు మేరకుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి, పర్యావరణ – అటవీ – సైన్స్ & టెక్నాలజీ శాఖా మంత్రి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ముత్యాలమ్మపాలెం పంచాయతీ లో గ్రామ సర్పంచ్ చింతకాయల సూజాత ముత్యాలు ఆధ్వర్యంలో క్లీన్ అంధ్ర గ్రీన్ అంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ అన్ని గ్రామాలలో వార్డులలో మొక్కలు నాటి కార్యక్రమం చెప్పటి వీది కాలువలు శుబ్రం చేయడం గ్రామాలలో చెత్తను డపింగ్ యార్డ్ కు తరలించడం జరిగింది.

అని అన్నారు రాబోయే రోజుల్లో మొక్కలు యెుక్క అవశ్యకత ఎంతైన ఉందని మనం పీల్చే గాలి ప్రతీది పొల్యూట్ అవుతుందని అందు కారణం చేత ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమం చేయాలని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పిలుపుమేరకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటీసి అర్జిల్లి దేవిరవి మండల కోఆప్షన్ సభ్యులు మైలపల్లి అప్పన్న, మాజీ ఎంపిటీసి చింతకాయల అమ్మోరు, మాజీ కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ సూరాడ ముత్యాలరావు , మత్స్యకార సొసైటీ ప్రెసిడెంట్ కోవిరి పెద్ద ముత్యాలు, మత్స్యకార నాయకులు, అర్జిల్లి అప్పారావు,చింతకాయల అప్పారావు ,చింతకాయల ముత్యాలనాయుడు, మైలపల్లి బంగారు రాజు ,మరియు గ్రామ పెద్దలు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీరు ఈ వార్తలు ఇంకా చదవలేదు.
- Advertisment -spot_img

తాజా వార్తలు