Wednesday, September 18, 2024
spot_img

Telangana : మంజీరా నదిలో ఇసుక త్రవ్వకలు జరిపితే వాహనాలు సీజ్ చేస్తాం

Telangana: అదుపు కలెక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ హెచ్చరిక.సహకరించిన అధికారులకు ఉద్యోగాల నుంచి తొలగింపు..మంజీర నది ఇసుక క్వారీల పరిశీలన.మంజీరా నది కొంతమంది ఇసుక దొంగలకు బంగారు బాతు గుడ్డుగా మారిపోయింది. గత గులాబీ ప్రభుత్వంలో గులాబీ నేతలు, వారి అనుచరులు మంజీరా నదిపై పడి అక్రమంగా ఇసుక త్రవ్వకాలు జరిపి కోట్లు దండుకున్నారు. వారు దండుకుంటే మేమేం తక్కువ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొంతమంది మంజీరా నదిలో అక్రమ ఇసుక దందకు తెర లేపారు. మంజీరా నదిలో కొనసాగుతున్న అక్రమ ఇసుక దందపై మన దినపత్రిక వరుస కథనాలు ప్రచురించింది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పందించారు . అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కి మంజీరా నదిలో అక్రమ ఇసుక దందా కు చెక్ పెట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో, వారం రోజుల క్రితం చెట్లూర్, అస్గుల్, కూర్ల, కత్తిగావ్, మద్నూర్ గ్రామాలకు చెందిన ఇసుక మాఫియా వారికి చెందిన ఆరు టిప్పర్లను స్వాధీనం చేసుకొని బిచ్కుంద పోలీస్ స్టేషన్కు తరలించారు.

మీరు ఈ వార్తలు ఇంకా చదవలేదు.
- Advertisment -spot_img

తాజా వార్తలు